Telangana :తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భూ ప్రకంపనలు
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భూ ప్రకంపనలు కనిపించాయి.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈరోజు ఉదయం స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలు స్వల్పంగానే నమోదయ్యయాని, ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రజలకు తెలిపారు.
ప్రజలు భయాందోళనలతో...
మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్ జిల్లాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెప్పారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇవి భూమిలో సంభవించే సాధారణ ప్రకంపనలు మాత్రమేనని, ఎవరూ భయపడవద్దని అధికారులు తెలిపారు. సాధారణంగా సంభవించేవేనని చెప్పారు.