నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు

నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు

Update: 2026-02-26 06:39 GMT

నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి జూపల్లి పాల్గొంటారు. ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పనుల పురోగతిపై మంత్రి జూపల్లి చర్చించనున్నారు. నేతలతో కూడా సమావేశం కానున్నారు.

పలు అభివృద్ధి పనులను...
మంత్రి జూపల్లి కృష్ణారావు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు హత్తిఘాట్ పంప్ హౌస్ హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న జూపల్లి, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అభివృద్ధి పనులపై జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించనున్నారు.


Tags:    

Similar News