Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2026-02-26 04:10 GMT

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలను అప్పగించారు.

45 మందికి బదిలీ ఉత్తర్వులు...
పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్ ను నియమించింది. విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక శాఖ కార్యదర్శిగా దానకిశోర్ ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్ నియమితులయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్ గా ఎం. హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా దివ్యను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Tags:    

Similar News