KTR : నేడు ఖమ్మం, సూర్యాపేటలో కేటీఆర్ పర్యటన

నేడు ఖమ్మం, సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు.

Update: 2026-02-26 03:59 GMT

నేడు ఖమ్మం, సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం భూదాన్ భూముల బాధితులను పరామర్శించనున్నారు. నిన్న భారీ పోలీసుల భద్రత మధ్య అక్కడ ఉన్న నివాసాలను కూల్చి వేయడంతో వారంతా నిర్వాసితులయ్యారు. వారితో సమావేశమై కేటీఆర్ భరోసా ఇవ్వనున్నారు. ఆందోళనలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పనున్నారు.

భారీగా పార్టీ శ్రేణులు...
అనంతరం ఈరోజు సాయంత్రం సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. ఇటీవల కోదాడలో జరిగిన లాకప్‌డెత్‌లో మృతిచెందిన కర్ల రాజేష్‌ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించనున్నారు. కేటీఆర్ వస్తుండటంతో భారీగా పార్టీ శ్రేణులు తరలి వచ్చే అవకాశముంది. ఇందుకోసం భారీగా పోలీసులను మొహరించాలని, ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


Tags:    

Similar News