Raja Singh : రాజాసింగ్ రీ ఎంట్రీకి అంతా సిద్ధమయిందా?

గోషామహల్ రాజాసింగ్ త ను బీజేపీ తిరిగి పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2026-02-25 12:25 GMT

గోషామహల్ రాజాసింగ్ త ను బీజేపీ తిరిగి పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసి నెలలు గడుస్తుంది. అయినా ఎమ్మెల్యే విషయంపై ఎటూ తేల్చలేదు. స్పీకర్ కు బీజేపీ లేఖ రాయలేదు. దీంతో రాజాసింగ్ మరోసారి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.అందుకే ఇటీవల రాజాసింగ్ యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. ఒవైసీ సోదరుల మీద మాటల దాడి చేస్తూ రాజాసింగ్ కమలం పెద్దలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పార్టీ నాయకత్వం వేటు వేసింది. సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

నెలలు గడుస్తున్నా...
అయితే పార్టీ సస్పెండ్ చేసి నెలలు గడుస్తున్నప్పటికీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ కు బీజేపీ నాయకత్వం లేఖ రాయకపోవడం వెనక కూడా ఖచ్చితంగా తిరిగి రాజాసింగ్ ను బీజేపీలో చేర్చుకునేందుకే అన్న అనుమానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. బీజేపీ తెలంగాణలో బలంగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందీ అంటే గోషామహల్ మాత్రమే. 2018 ఎన్నికల్లోనూ రాజాసింగ్ ఒక్కడే బీజేపీ నుంచి గెలవడంతో ఆయన సస్పెన్షన్ తాత్కాలికమేనని అంటున్నారు. గతంలోనూ రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసిన బీజేపీకేంద్ర నాయకత్వం తర్వాత దానిని ఎత్తివేసింది. ఇప్పుడు మరోసారి సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. అందుకే రాజాసింగ్ తిరిగి ఒవైసీ సోదరులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఫామ్ లోకి వస్తున్నాడంటున్నారు.
హ్యాట్రిక్ విజయాలతో...
రాజాసింగ్ బీజేపీ నుంచి గోషామహల్ నియోజకవర్గంలో మూడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. పార్టీతో తనకున్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరని పలు సార్లు రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తనను నాలుగోసారి కూడా గోషా మహల్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తారని రాజాసింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని రాజాసింగ్ తెలిపారు. అయినా సరే కేంద్ర నాయకత్వం రాజాసింగ్ లాంటి గెలుపు గుర్రాన్ని వదులుకోవడం అవివేకమని భావించి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. త్వరలోనే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశముందని చెబుతున్నారు. మరి నాయకత్వం ఏం చేస్తుందన్నది చూడాలి.


Tags:    

Similar News