Cold Waves : చలి ఇప్పట్లో వదిలే అవకాశం లేదట... ఈ నెలలోనూ గజ..గజ
చలితీవ్రత మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
చలితీవ్రత మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబరు నుంచి ప్రారంభమైన చలితీవ్రత నేటి వరకూ కొనసాగుతుంది. వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం జనవరి నెలలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలితీవ్రత రానున్న రోజుల్లో పెరుగుతుందని, అలాగే పొగమంచు కూడా మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. చలి కొంత తగ్గుతుందని అనిపించినప్పటికీ మళ్లీ చలితీవ్రత పెరుగుతుందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. చెదురుమదురుగా వానలు కూడా పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రానున్న రెండు రోజుల్లో...
ఆంధ్రప్రదేశ్ లో జనవరి నెలలోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో చలి తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో చలితీవత్ర పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు వీలయినంత వరకూ ఉదయం, సాయంత్రం వేళ బయటకు రాకుండా చలి నుంచి కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పొగమంచుతో ఇబ్బంది...
తెలంగాణలోనూ రానున్న రోజుల్లో చలితీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో చలితీవ్రత ఎక్కువవుతుందని, ప్రధానంగా రహదారులపై ప్రయాణాలను వీలయినంత వరకూ ఉదయం, రాత్రి వేళల్లో వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. దట్టమైన పొగమంచుతో రహదారులు ముందు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రథానంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, మంచిర్యాల, మెదక్, ములుగు, నిజామాబాద్, సిద్ధిపేట, రంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో చలితీవ్రత ఎక్కవుగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.