Telangana : నేడు బీజేపీ కీలక సమావేశం
నేడు భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది
నేడు భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. ఉదయం పది గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ లు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశముంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై...
ఈ సమావేశం అనంతరం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరుగుతుంది. ఇందులో పాల్గొననున్న సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ పాల్గొని రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఈ సమావేశంలో నేతల నుంచి అభిప్రాయాలను సేకరించే అవకాశముంది.