చౌటుప్పల్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు

చౌటుప్పల్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Update: 2026-02-14 05:21 GMT

చౌటుప్పల్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా రెండు భారీ రియాక్టర్లు పేలాయి. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. భారీ శబ్దానికి ఇళ్ల నుంచి పరుగులు తీసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మూడు గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ప్రమాద సమయంలో...
ప్రమాద సమయంలో లోపల పదకొండు మంది సిబ్బంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మంటలను అదుపులోకి రెండు ఫైర్ ఇంజన్లు తెచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు ఏంటన్న దానిపై అధికారులు విచారణ జరిపి వెల్లడించాల్సి ఉందని అక్కడి వారు చెబుతున్నారు.


Tags:    

Similar News