Telangana : మల్లు రవి ఎమ్మెల్యేపై చేయి చేసుకోవడం దారుణం

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుపై చేయి చేసుకోవడాన్ని కేటీఆర్ ఖండించారు

Update: 2026-01-21 07:42 GMT

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుపై చేయి చేసుకోవడాన్ని కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ దాడులు పెరిగిపోయాయని అన్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికయిన ఎమ్మెల్యేలను అవమానించడమేనని కేటీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్ నేతలకు ఎలాంటి గౌరవం లేదని కేటీఆర్ అన్నారు. విజయుడుకు మల్లు రవి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సీసీ రోడ్ల ప్రారంభం సందర్భంగా...
తమ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. స్థానికంగా సీసీ రోడ్లు ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత ఎంపీగా మల్లు రవి టెంకాయ కొట్టారని, తర్వాత ఎమ్మెల్యే విజయుడు కొట్టాల్సి ఉండగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ అభ్యంతరం చెప్పడంతో విజయుడు ప్రశ్నించడంతో అతనిపై మల్లు రవి చేయి చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికేనా రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు


Tags:    

Similar News