Telangana : ఖమ్మం మరోసారి కాంగ్రెస్ కు కంచుకోటగా మారిందిగా

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది.

Update: 2026-02-13 06:22 GMT

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చినట్లయింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. ముగ్గురు మంత్రులు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నారు. దీంతో అక్కడ అత్యధిక స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపును రుచి చూశార.

ముగ్గురు మంత్రులు...
2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అదే పంథాను మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తున్నట్లే కనపడుతుంది. ముగ్గురు మంత్రులు మున్సిపల్ ఎన్నికలకు ముందే తమ ప్రాంతాల్లో పర్యటించి పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా తమ వైపునకు తిప్పుకునేలా చూడగలిగారు. ఏపీ సరిహద్దు జిల్లా కావడంతో కొంత అక్కడి పార్టీల ప్రభావం కూడా ఈ ఫలితాలపై కనిపించిందన్న విశ్లేషణలు అందుతున్నాయి. దీంతో పాటు అక్కడ బీఆర్ఎస్ బలహీనంగా మారడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చిందనే చెప్పాలి.
ఏడు మున్సిపాలిటీల్లో...
ఖమ్మం జిల్లాల్లో ఏడు మున్సిపాలిటీలున్నాయి. ఇప్పటికే అశ్వారావుపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటినట్లయింది. అశ్వారావుపేట, మధిర, వైరా, ఏబులాపురం తో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ విజయం సాధించింది. కల్లూరులోనూ మున్సిపాలిటీని ఏకపక్షంగా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇల్లెందు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఏడు మున్సిపాలిటీల్లో నాలుగింటిని ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకోగా, రెండింటిలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మొత్తం మీద ముగ్గురు మంత్రులు ఈ ఎన్నికల్లో తమ సత్తాను చాటినట్లయింది. బీఆర్ఎస్ నామమాత్రంగానే నిలిచింది.


Tags:    

Similar News