Telangana : ఎమ్మెల్యేలకు రేవంత్ క్లాస్.. ఇలా అయితే కష్టమే

సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీరియస్ అయ్యారు

Update: 2025-12-21 03:02 GMT

సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలపైముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్‌ కుమార్ గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌ లు సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సొంత బంధువులకు టికెట్‌ ఇచ్చి...
సొంత బంధువులకు టికెట్‌ ఇచ్చి పార్టీకి నష్టం చేశారని.. రెబల్స్‌ను కనీసం బుజ్జగించలేదని కాంగ్రెస్ నేతలు మండి పడ్డారు. బంధువులను పక్కన పెట్టి కార్యకర్తలకు పెద్దపీట వేయాల్సిన సమయంలో ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించినట్లు తెలిసింది. రిపీట్‌ అయితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. ప్రధానంగా వరంగల్‌, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు పీసీసీ నేతలు క్లాస్ పీకినట్లు తెలిసింది.


Tags:    

Similar News