Telangana : తెలంగాణ వ్యాప్తంగా నేడు కాంగ్రెస్ పార్టీ నిరసనలు
తెలంగాణ వ్యాప్తంగా నేడు కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేయనుంది
తెలంగాణ వ్యాప్తంగా నేడు కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేయనుంది. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథాన్ని పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదించుకుంది.
ఉపాధి హామీ పేరు మార్పుపై...
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి వీబీ జీ రామ్ జీ పథకం గా పేరు మార్చింది. దీంతో గాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నిరసనలు తెలంగాణ వ్యాప్తంగా తెలియజేయనుంది. ఏఐసీసీ పిలుపు మేరకు నిన్న హైదరాబాద్ లో నిరసనలు నిర్వహించిన కాంగ్రెస్ నేడు జిల్లాల్లో ఆందోళనలను చేయనుంది.