ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం

Update: 2026-02-14 14:09 GMT

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధకిారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతించింది. ఐఏఎస్ అధికారిని ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించడంతో ఇక ఏసీబీ ఈ కేసులో ఛార్జి షీట్ దాఖలు చేసే అవకాశముంది.

ప్రాసిక్యూషన్ కు అనుమతి...
ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కూడా అనుమతిచ్చారు. ఫార్ముల ఈ కారు రేసు కేసులో ఇప్పటికే అందరినీ అవినీతినిరోధక శాఖ విచారణ చేసింది. అయితే కోర్టులో ఛార్జిషీట్ ఇప్పటి వరకూ దాఖలు చేయలేదు. ఇక రాజకీయ నేతలు, ఐఏఎస్ ల ప్రాసిక్యూషన్ కు అనుమతి రావడంతో కోర్టులో ఏసీబీ అధికారులు ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముంది.


Tags:    

Similar News