KCR : నేడు అసెంబ్లీకి కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీకి వస్తున్నారు

Update: 2024-02-10 03:51 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన తొలిసారి అసెంబ్లీకి వస్తున్నారు. దీంతో ఆసక్తి నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సారి సభకు వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలకనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే శాసనసభకు వచ్చారు.

తొలిసారి వస్తుండటంతో...
అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేకపోవడంతో కేసీఆర్ ఇంత వరకూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఆయన గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కూడా బాధ్యతలను స్వీకరించారు. ఆయన బడ్జెట్ సందర్భంగా సభకు వస్తుండటం విశేషం. నేడు మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆయన సభకు రానున్నారు. రెండు రోజుల పాటు సభకు దూరంగా ఉన్న కేసీఆర్ నేడు శాసనసభకు వస్తున్నారు.


Tags:    

Similar News