మూడేళ్లలో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్.. అమెరికాలో కేటీఆర్
అమెరికా పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో మూడేళ్లలో బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని తెలిపారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారని కొనియాడారు.
డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణంలో బీఆర్ఎస్ రజతోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు.