Telangana : ఏడు రోజుల బిడ్డ ఆరు లక్షలకు విక్రయం

కరీంనగర్ జిల్లాలో చైల్డ్ ట్రాఫికింగ్ కేసు బయటపడింది.

Update: 2025-11-22 07:42 GMT

కరీంనగర్ జిల్లాలో చైల్డ్ ట్రాఫికింగ్ కేసు బయటపడింది. ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో నిరాశలో పడిన ఓ యువతి, పుట్టిన ఏడు రోజుల బిడ్డను ఆరు లక్షల రూపాయలకు అమ్మేసిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఆ యువతి ఒక యువకుడితో సంబంధం పెట్టుకుంది. మధ్యలో అతడు ఆమెను వదిలిపెట్టాడు. ఈ క్రమంలో కడుపుబారిన ఆమెకు ఆ బిడ్డను చూసుకోవడానికి తనకు ఆర్థిక స్థోమత లేదని భావించిన యువతి ఆ బిడ్డను అమ్ముకోవడానికి సిద్ధపడిందని పోలీసులు చెప్పారు.

ప్రేమించిన వాడు...
పోలీసుల కథనం ఇందుకు పన్నెండు మంది బ్రోకర్లు ఉన్నారు. గన్నెరువారం మండలం చాకలివానిపల్లెకు చెందిన బామండ్ల రాయమల్ల, లత దంపతులకు ఆ బిడ్డను ఆరుగలక్షలకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బిడ్డను గుర్తించి మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తల్లి, కొనుగోలు చేసిన దంపతులు వారికి సహకరించిన పదిహేను మందికి పైగా వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.




Tags:    

Similar News