Telangana : భూ పోరాటానికి దిగిన కవిత

కరీంనగర్ జిల్లాలో కల్వకుంట్ల కవిత ఆందోళనకు దిగారు.

Update: 2025-12-31 08:30 GMT

కరీంనగర్ జిల్లాలో కల్వకుంట్ల కవిత ఆందోళనకు దిగారు. తెలంగాణలో ఉద్యమకారులకు 250 గజాల నివాస స్థలాన్ని ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీని అమలు పర్చలేదని తెలిపారు. అందుకే నేడు రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటం ప్రారంభించామన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఐదు ఎకరాలను ఆక్రమించుకుని ఈ భూమిని ఉద్యమకారులకు పంచి పెట్టాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లాలో...
భూ పోరాటం ప్రారంభించడానికి ముందు అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనంతరం మానకొండూరుకు చేరుకొని భూ పోరాటం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈరోజు ఉద్యమకారులతో కలసి భూ పోరాటం చేస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News