బీఆర్ఎస్ బీజేపీ తోకపార్టీగా మారుతుంది : కవిత

బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో అపజయంపై కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు

Update: 2026-02-14 12:06 GMT

బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో అపజయంపై కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాల కారణంగానే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ కు సానుకూలంగా మారాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా తాను భావిస్తున్నానని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ తోక పార్టీగా మారుతుందని కవిత చెప్పారు. ఒకప్పుడు సీపీఐ, సీపీఎంలు తోకపార్టీలగా భావించేవారమని, ఇప్పుడు ఆ వంతు బీఆర్ఎస్ కు వచ్చిందన్నారు. కాళేశ్వరం విషయంలో శాసనసభలో కూనంనేని సాంబశివరావు ఏం మాట్లాడారో గుర్తు లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

పోరాటం ఎక్కడ?
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరాటం చేయడం లేదని, కేటీఆర్, మాజీ మంత్రులు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని చోట్ల ప్రచారం చేశారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ కొన్ని స్థానాలలో మూడో స్థానంలో, మరికొన్ని చోట్ల నాలుగో స్థానంలో నిలిచిందని అన్నారు. అయితే వచ్చినవి ఎక్కువ రావడంగా కేటీఆర్ చెప్పడం దురదృష్టకరమని కవిత అన్నారు. ఇక ఈ పరిస్థితుల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించే అవకాశం లేదని కవిత అభిప్రాయపడ్డారు. తమది ట్రైలర్ మాత్రమేనని, ముందు ముందు అసలు సినిమా ఉంటుందని కవిత తేల్చిచెప్పారు.


Tags:    

Similar News