కేసీఆర్ పై కడియం సంచలన కామెంట్స్

మాజీ సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2026-02-19 12:47 GMT

మాజీ సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ తెలంగాణకు ఎలా జాతిపిత అయ్యారని ప్రశ్నించారు. కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. జాతిపిత ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని కడియం శ్రీహరి నిలదీశారు. అవకతవకలు, అక్రమాలు చేసి చాలా స్కాములలో ఇరుక్కున్నారని, కూలిపోయే కాళేశ్వరం కట్టడమే కాకుండా, రాష్ట్రాన్ని దివాలా తీశారని విమర్శించారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుని రాజకీయాలు చేస్తాంటూ కడియం శ్రీహరి ప్రశ్నించారు.

హోదాకు మించి మాట్లాడుతున్నారంటూ...
కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. కడియం శ్రీహరి లాగా కేసీఆర్ ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేదని, పదవుల కోసం పాకులాడలేదన అన్నారు. ఆరోజు కేసీఆర్ దేవుడు అన్న కడియం శ్రీహరికి ఇప్పుడు కేసీఆర్ చిన్నగా కనిపిస్తున్నాడా ? అని వివేకానంద ప్రశ్నించారు.


Tags:    

Similar News