తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు.
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ నియామితులయ్యారు. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ బట్టు దేవానంద్ ను తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమించార. గతంలోనూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ బట్టు దేవానంద్ ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి బీఎల్ పూర్తిచేశారు.
జస్టిస్ బట్టు దేవానంద్....
జస్టిస్ బట్టు దేవానంద్ తో పాటు తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్.. త్రిపుర హైకోర్టు సీజేగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు నియమించార. ప్రస్తుతం ఝార్ఖండ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ రామచంద్రరావును త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు. మద్రాస్, రాజస్థాన్ హైకోర్టులకు కూడా ప్రధాన న్యాయమూర్తుల బదిలీ చేశారు. బదిలీ ఉత్తర్వులను కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ విడుదల చేసింది.