జగిత్యాలలో సత్తా చాటిన జీవన్ రెడ్డి

జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో గెలిచారు

Update: 2026-02-14 04:23 GMT

 jeevan reddy congress leader

జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో గెలిచారు. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన జీవన్ రెడ్డి అనుచరులు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. జగిత్యాలలోని మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు పన్నెండు స్థానాల్లో గెలవగా, బీజేపీ నాలుగు, బీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం నాలుగు స్థానాల్లో గెలిచాయి.

పథ్నాలుగు వార్డుల్లో...
14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. వీరంతా జీవన్ రెడ్డి అనుచరులే. పార్టీ టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మరీ విజయం సాధించారు. దీంతో జగిత్యాలలో జీవన్ రెడ్డి మద్దతుతోనే కాంగ్రెస్ అభ్యర్థి ఛైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశముంది. మరి జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది చూడాలి.


Tags:    

Similar News