జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.

Update: 2026-02-16 08:03 GMT

జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ ఎన్నిక సందర్బంగా కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేశారని, కొందరిని బలవంతంగా భయపెట్టి బీఆర్ఎస్ నేతలు లోబర్చుకున్నారని, ఎన్నిక వాయిదా వేయాలని కోరారు.

రెండు వర్గాలకు ...
అయితే అధికారులు రెండు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ కు చెందిన కౌన్సిలర్లు ఎన్నికల అధికారి ఎదుట ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో ససమావేశం ఆర్డర్ లేనందున వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అధికారులు వెళ్లిపోయారు. బీఆర్ఎస్ అక్కడ అధిక స్థానాలు సాధించడంతో అక్కడ కాంగ్రెస్ పట్టుబట్టి వాయిదా వేయించిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


Tags:    

Similar News