తెలంగాణలో జాతీయ నేతల హడావిడి

తెలంగాణలో బీజేపీ జీవో నెంబరు 317 ను వ్యతిరేకిస్తూ ఆందోళనను కొనసాగించనుంది.

Update: 2022-01-06 02:49 GMT

తెలంగాణలో బీజేపీ జీవో నెంబరు 317 ను వ్యతిరేకిస్తూ ఆందోళనను కొనసాగించనుంది. అయితే ఈ నెల 10వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ ను మాత్రం విరమించుకుంది. వరసగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆందోళనలను చేయాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. నిన్ననే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.

ఈరోజు రమణ్ సింగ్....
ఈరోజు జరిగే ఆందోళనలో చత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పాల్గొంటారు. ఆయనతో పాటు పార్టీ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ కరీంనగర్ వెళ్లనున్నారు. రేపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ కు వస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. వరసగా రాష్ట్ర ప్రభుత్వం జీవో పై వెనక్కు తగ్గే వరకూ తమ ఆందోళనలను కొనసాగిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.


Tags:    

Similar News