ఫాతిమా కళాశాల కూల్చివేతపై క్లారిటీ ఇచ్చిన రంగనాధ్

హైదరాబాద్ నగరంలో ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా కళాశాలను కూల్చకపోవడానికి గల కారణాలను హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు

Update: 2025-07-09 05:26 GMT

హైదరాబాద్ నగరంలో ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా కళాశాలను కూల్చకపోవడానికి గల కారణాలను హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు. గతంలో ఫాతిమా కళాశాలను కూడా కూల్చివేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ కూల్చకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. అయితే దీనికి సమాధానమిచ్చారు రంగనాధ్. కానీ బిల్డింగ్ కూల్చివేతలపై వెనక్కు తగ్గారన్న ఆరోపణలను రంగనాథ్ కొట్టిపారేశారు. ఎఫ్.టి.ఎల్ పరిధిలో కళాశాల నిర్మించినందుకు దానిని తొలగిస్తామని చెప్పిన అధికారులు తర్వాత దాని ఊసు పట్టించుకోలేదని రంగనాధ్ తెలిపారు.

హైడ్రా ఏం చెప్పిందంటే?
పేద ముస్లిం విద్యార్థినుల కోసం కళాశాల పనిచేస్తుందన్నారు. గత సెప్టెంబరు నెలలోనే తొలగించాలని అనుకున్నా అక్కడ పేద విద్యార్థినులు ఇబ్బందులు పడతారని, దాదాపు పది వేల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, నిరుపేదల విద్యార్థుల కోసం పనిచేస్తున్న కళాశాల విషయంలో సామాజిక కోణంలో ఆలోచించి కూల్చివేతలు చేపట్టలేదని రంగనాధ్ తెలిపారు. అలాగే ఎంఐఎం నేతలకు సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులను హైడ్రా స్వాధీనం చేసుకుందని రంగనాధ్ తెలిపారు.


Tags:    

Similar News