మేడారం మహా జాతర హుండీ ఆదాయం ఎంతంటే?
మేడారం జాతర సందర్భంగా ఆదాయం భారీగా లభించింది
మేడారం జాతర సందర్భంగా ఆదాయం భారీగా లభించింది. హుండీ ఆదాయం రూ.13.25 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.తెలంగాణలో అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో హుండీల లెక్కింపు బుధవారంతో ముగిసింది. ఈ నెల 5 నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన లెక్కింపులో మొత్తం 828 హుండీలను తెరిచి లెక్కించారు.
వారం రోజులు లెక్కించి...
వారం రోజుల పాటు 400 మంది సిబ్బంది దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. మొత్తం రూ.13,25,83,269 ఆదాయం లభించినట్లు వెల్లడించారు. విదేశీ కరెన్సీ, రద్దు నోట్లు, బంగారం, వెండి ఆభరణాలు లభించాయి. గత జాతరలో 540 హుండీలతో రూ.13.25 కోట్లు రాగా, ఈసారి 828 హుండీలు పెట్టినా దాదాపు అంతే ఆదాయం వచ్చింది. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు సమర్పించుకున్న భక్తులు వివిధ రూపాల్లో కానుకలను సమర్పించారు.