తెలంగాణలో ప్రవేశ పరీక్షలు జరిగే తేదీలివే

తెలంగాణలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది

Update: 2025-01-15 12:11 GMT

తెలంగాణలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌ జరగనుంది. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో ఈఏపీసెట్‌ (అగ్రికల్చర్‌, ఫార్మసీ) పరీక్షలు జరగనున్నాయి. మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ కు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు.

ముందుగా ప్రిపేర్ అవ్వడానికి...
మే 12న ఈసెట్, జూన్ 1వ తేదీన ఎడ్‌సెట్‌, జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులు ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతారని ముందుగానే షెడ్యూల్ ను ప్రకటించినట్లు ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు.


Tags:    

Similar News