Telangana : వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.

Update: 2026-03-07 11:49 GMT

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదని సంజయ్ కుమార్ తెలిపారు. తనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు. అప్పటి వరకూ నియోజకవర్గ అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని ఆయన చెప్పారు.

తనపై విమర్శలు చేస్తున్న వారు...
తనపై విమర్శలు చేస్తున్న వారు కూడా ఆలోచించుకోవాలని అన్నారు. తనపై చేస్తున్న విమర్శలకు అభివృద్ధితోనే సమాధానమిస్తామనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పారు. ఎవరి విమర్శలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని సంజయ్ కుమార్ అన్నారు.


Tags:    

Similar News