Kalvakuntla Kavitha : కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది

Update: 2024-05-10 07:48 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 24 వతేదీకి విచారణను వాయిదా వేసింది. ఈడీని వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు కోరింది. కవిత తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తీహార్ జైలులో...
తర్వాత తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 14వ తేదీ వరకూ పొడిగించింది. దీంతో నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ చేసి ఈడీ వివరణ కోరింది. ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.


Tags:    

Similar News