Telangana : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు...రెండు విడతలుగా

Telangana : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు...రెండు విడతలుగా

Update: 2026-02-12 08:11 GMT

తెలంగాణ రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఫలితాలు తమ అంచనాల మేరకు ఉంటే అదే ఊపులో పరిషత్‌ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉంది. అప్పుడే గెలుపు సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. ఈ వేడిలోనే ఎన్నికలు జరిపించాలని, రేపటి ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మార్చి తొలి వారంలో...
మరొక వైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎన్నికలు జరగకపోతే జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం నుంచి రావాల్సిన 450 కోట్ల రూపాయల నిధులు మురిగిపోయే అవకాశం ఉంది. అందుకే పరిషత్‌ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చి తొలివారంలో రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరిగనున్నట్లు అధికారికవర్గాల నుంచి అందుతున్న సమాచారం.


Tags:    

Similar News