రేపటి నుంచి రైతు బంధు పథకం నగదు జమ

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రైతు బంధు డబ్బులను రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Update: 2021-12-14 03:25 GMT

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రైతు బంధు డబ్బులను రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలుజారీ చేశారు. రైతుల ఖాతాల్లో నేరుగా రేపటి నుంచి విడతల వారీగా నగదును జమ చేయనున్నారు. రైతు బంధు పథకానికి అవసరమైన 7,500 కోట్ల నిధులను ప్రభుత్వం ఆర్థిక శాఖను కోరింది. ఆర్థిక శాఖ ఈ నగదును సర్దుబాటు చేయడంతో రేపటి నుంచి రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ అవతుంది.

విడతల వారీగా....
రేపటి నుంచి ఈ నెలాఖరు వరకూ రైతు బంధు పథకం కింద నగదును జమ చేస్తారు. తొలి రోజు ఎకరం ఉన్నవారికి, తర్ాత రెండు ఎకరాలు, ఆ తర్వాత మూడు ఎకరాలు ఉన్నవారి ఖాతాల్లో నగదు జమ కానుంది.


Tags:    

Similar News