Telangana : ఇంజినీరింగ్ విద్యార్థులకు తీపికబురు.. భారీగా ఫీజులు తగ్గింపు
తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు తీపికబురు అందింది. ఫీజులు తగ్గించాలని నిర్ణయించింది
తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు తీపికబురు అందింది. ఫీజులు తగ్గించాలని నిర్ణయించింది. ఫీజుల నియంత్రణ కోసం నియమించిన తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఈ మేరకు చాలా ఇంజినీరింగ్ కళాశాలల్లో భారీగా ఫీజులు తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు తగ్గనున్నాయి.
ప్రతిపాదనలు సిద్ధం...
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట లభించనుంది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ ఖరారు చేసిన తాజా ప్రతిపాదనల ప్రకారం 10-15 కళాశాలల్లో పాత ఫీజులలో కోత విధించగా, అధికశాతం కాలేజీలకు గత ఫీజులే కొనసాగనున్నాయి. 20 లోపు కళాశాలలకు 10-15 శాతం వరకు స్వల్ప పెంపుదలకు అనుమతించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫైలు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలనలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయి.