రేవంత్ పక్కన ఉంది వాళ్లే..అంజనీకుమార్ సంచలన కామెంట్స్

కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజనీకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-02-24 12:41 GMT

కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజనీకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వెంట ఇప్పుడు ఉన్నవాళ్లెవరు అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డిలు మాత్రమే ఇప్పడు కనిపిస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి వెంట ఒక సామాజికవర్గ నేతలే ఉన్నారని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

గెలిచే సమయంలో..
గెలిచే సమయంలో తనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని అంజనీకుమార్ యాదవ్ అన్నారు. దానం నాగేందర్ కు ఇచ్చినందునే ఓటమి పాలయ్యారని అన్నారు. కష్ట సమయంలో అండగా ఉన్నవారిని ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన పెట్టారంటూ అంజనీకుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే బీసీలు దూరమవుతారని ఆయన అన్నారు.


Tags:    

Similar News