రూ.144 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

తెలంగాణలో జరిగిన ఈఎస్ఐ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 144 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

Update: 2021-11-23 12:27 GMT

తెలంగాణలో జరిగిన ఈఎస్ఐ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 144 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కామ్ లో నిందితులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఏడు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి 211 కోట్ల రూపాయలు నష్టం కలిగించేలా మందుల కొనుగోళ్లలో చేతివాటం చూపారని ఏసీబీ అధికారులు గుర్తించారు.

131 రకాల ఆస్తులు....
ఏసీబీ అధికారుల కేసుల ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వీరిపై దృష్టి పెట్టింది. ఈఎస్ఐ స్కామ్ లో నిందితుల నుంచి 144 కోట్ల ఆస్తులను జప్తు చేస్తింది. 131 రకాల ఆస్తులను జప్తు చేసింది. 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 కమర్షియల్ కాంప్లెక్స్ లు ఇందులో ఉన్నాయి. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వరి రెడ్డి, నాగలక్ష్మి, పద్మల ఆస్తులను సీజ్ చేశారు. ఇందులో ఒక్క దేవికారాణికి సంబంధించిన ఆస్తులే 6.28 కోట్లున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నై నగరాల్లో ఉన్న ఈ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. పెద్దమొత్తంలో నగదును కూడా సీజ్ చేసినట్లు తెలిసింది.


Tags:    

Similar News