Telangana : మూడు మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా

ఈరోజు ఎనిమిది మున్సిపాలిటీల్లోనే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరిగింది

Update: 2026-02-17 11:45 GMT

ఈరోజు ఎనిమిది మున్సిపాలిటీల్లోనే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరిగింది. మరో మూడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికను వాయిదా వేశారు. అయితే తిరిగి ఎన్నికను ఎప్పుడు జరుపతారన్నది ఎన్నికల అధికారులు త్వరలోనే తెలియజేయనున్నారు.

ఎనిమిది మున్సిపాలిటీల్లో...
నిన్నమొత్తం పదకొండు మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. ఈరోజు వాయిదా పడిన అన్ని మున్సిపాలిటీలలో ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్నిక జరపడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో ఈ మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికను వాయిదా వేసినట్లు తెిపారు.


Tags:    

Similar News