కొండగల్ లో హరీశ్ రావు రేవంత్ పై సెటైర్లు
కొడంగల్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించారు
కొడంగల్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు.మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు తెచ్చామన్న హరీశ్ రావు ఎస్సీ, ఎస్టీల కేటాయింపులు రూ.2731 కోట్లని, ఖర్చు చేసింది కేవలం రూ.50 కోట్లేనని హరీశ్ రావు చెప్పారు. సేవాలాల్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించారని, రూపాయి కూడా విడుదల చేయలేదని హరీశ్ రావు విమర్శించారు.
కేరళ వెళ్లి ఆరు గ్యారంటీలంటూ...
లగచర్ల రైతులను జైల్లో పెట్టిన ఘనత రేవంత్‌దేన్న హరీశ్ రావు కేరళ వెళ్లి 6 గ్యారంటీలు అమలు చేశామని చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలౌతున్నట్టు నిరూపిస్తావా అని నిలదీశారు. 100శాతం రుణమాఫీ అయినట్టు కొడంగల్‌లో నిరూపిస్తావా అని హరీశ్ రావు సవాల్ విసిరారు. రేవంత్ ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ ఖతమేనని హరీశ్ రావు అన్నారు. కేరళలోనూ కాంగ్రెస్ ఓడిపోతుందని హరీశ్ రావు జోస్యం చెప్పారు.