Telangana : హాయ్ అని మెసేజ్ చేస్తే.. సేవలన్నీమీ అరచేతిలో
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి అన్ని పౌర సేవలు వాట్సాప్ లో అందుబాటులోకి తెచ్చింది.ఇప్పటికే మీ సేవ సౌకర్యలు, ఇంటర్, పది పరీక్షల హాల్ టికెట్స్ వాట్సాప్ లో అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. ఒక్కొక్కటి వివిధ శాఖల సర్వీసులను కూడా వాట్సాప్కు లింక్ చేస్తోంది. దీంతో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సర్వీసు లింక్ ఒక్క వాట్సాప్ మెసేజ్తో ప్రత్యక్షం కానుంది. రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్ బోర్డులు కూడా భవిష్యత్తులో ఈ మార్గాన్ని అనుసరించేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. దీంతో అటు ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే పని లేకుండా కేవలం ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పనులు చక్కబెట్టుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.దీని కోసం ప్రత్యేకంగా 80969 58096 అనే నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను కేంద్రీకృతం చేశారు.