Telagnana : తెలంగాణకు ఫుల్లు కిక్కు.. సరికొత్త రికార్డు
ఆదాయంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది
ఆదాయంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.44,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు అన్ని మార్గాల ద్వారా కలిపి మొత్తం రూ.44,557 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
ఇంత భారీ మొత్తంలో...
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒకే ఏడాదిలో ఇంత భారీ మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమమని క్సైజ్ శాఖ అధికారులు చెప్పారు.2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.40,209 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని, దీని ద్వారా ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.39,368 కోట్ల ఆదాయం లభించిందని క్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అదనంగా రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.1,771 కోట్లు, 1,214 బార్ల ద్వారా రూ.549 కోట్లు లభించినట్లు వెల్లడించారు.