Telangana : నేడు మున్సిపల్ ఎన్నికల హీట్

నేడు తెలంగాణలో మూడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి

Update: 2026-04-04 03:32 GMT

నేడు తెలంగాణలో మూడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం పదకొండు గంటలకు ఈ మూడు మున్సిపాలిటీలకు చెందిన వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికలు జరుగుతాయి.

మూడు మున్సిపాలిటీల్లో...
ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అనేక కారణాలతో ఈ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక వాయిదా పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఈ మున్సిపాలిటీలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఈ మూడు మున్సిపాలిటీల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ విధించారు. హైకోర్టు ఆదేశాలతో ఈ ఎన్నికలు జరగనున్నాయి.


Tags:    

Similar News