Telangana : తీరని గ్యాస్ కష్టాలు.. ఎంత పొడవు క్యూ అంటే?

తెలంగాణలో ఎల్.పి.జి గ్యాస్ కష్టాలు తీరడం లేదు.

Update: 2026-04-03 04:21 GMT

తెలంగాణలో ఎల్.పి.జి గ్యాస్ కష్టాలు తీరడం లేదు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల కొరత వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ లో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పడి గాపులు కాస్తున్నారు. వారం రోజుల నుంచి వంట గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారీగా వినియోగదారులు చేరుకుని...
గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయని సమాచారం అందుకున్న వినియోగదారులు భారీ సంఖ్యలో గ్యాస్ గోదాము వద్దకు చేరుకున్నారు. వందల సంఖ్యలో ఖాళీ సిలిండర్లను ఉంచి గ్యాస్ కోసం నిరీక్షిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే గ్యాస్ కోసం క్యూ లైన్ లో పడిగాపులు పడుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ వినియోగదారులు మాత్రం గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు.


Tags:    

Similar News