టెన్షన్ లేపుతున్న కరీంనగర్ మేయర్ ఎన్నిక

కరీంనగర్ మేయర్ ఎంపికలో క్షణాక్షణానికి ఉత్కంఠ నెలకొంటుంది

Update: 2026-02-16 04:48 GMT

కరీంనగర్ మేయర్ ఎంపికలో క్షణాక్షణానికి ఉత్కంఠ నెలకొంటుంది. బీఆర్ఎస్ తొలుత మేయర్ ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తన మనసును మార్చుకున్నట్లు తెలిసింది. 66 డివిజన్లున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో 30 డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. పథ్నాలుగు డివిజన్లలో కాంగ్రెస్ గెలిచింది.

బీఆర్ఎస్ వ్యూహాన్ని మార్చుకుని...
అయితే కాంగ్రెస్ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు హాజరై తటస్థంగా ఉండాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు హాజరైతే కోరం వస్తుంది. అప్పుడు ఎన్నిక జరుగుతుంది. బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ కు దూరంగానే ఉంటూ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సహకరించాలని బీఆర్ఎస్ భావిస్తుంది.


Tags:    

Similar News