Telangana : ఈ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా
Telangana : ఈ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక నేడు జరిగింది. అయితే ఇందులో పదకొండు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ల, వైస్ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. తొర్రూర్, జనగామ, డోర్నకల్, ఇంద్రేశం, జహీరాబాద్, ఖానాపూర్, క్యానపల్లి, కాగజ్ నగర్, ఇబ్రహీంపట్నం, సుల్తానాబాద్, ఇల్లందు మున్సిపాలిటీల్లో వాయిదా పడింది.
ఎన్నిక ఎప్పుడన్న దానిపై...
అయితే తిరిగి ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై ఇంకా అధికారులు ప్రకటించలేదు. కోరం లేకపోవడంతో కొన్నిచోట్ల, సమావేశంలో సరైన పరిస్థితులు లేకపోవడంతో మరికొన్ని చోట్ల ఎన్నికను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఉద్రిక్తతలు చాలా చోట్ల నెలకొని ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి.