Telangana : మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ కు రిలీఫ్
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ముందస్తు అనుమతులు తీసుకోలేదని పటోళ్ల కార్తీక్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటీషన్ వేశారు. అయితే దీనిపై విచారించిన ఎన్.జి.టి. ఆ పిటీషన్ న కొట్టివేసింది.
రాజకీయ దురుద్దేశంతోనే...
రాజకీయ దురుద్దేశంతోనే పిటీషన్ వేశారని ప్రబుత్వం వాదించింది. దీంతో మూసీ ప్రక్షాళనకు ఎన్.జి.టి అభ్యంతరం లేదని చెప్పడంతో ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ఓకే చెప్పినట్లయింది. ఎన్జీటీ ఇచ్చిన తీర్పుతో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం వేగవంతం చేయనుంది.