Telangana : నేడు తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక

నేడు తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది

Update: 2026-02-17 03:02 GMT

నేడు తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది. నిన్న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్లన్ల ఎన్నిక నిలిచిపోయిన చోట నేడు ఎన్నిక జరపాలని అధికారులు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, తొర్రూర్, సుల్తానాబాద్, కాగజ్‌నగర్, ఇల్లందు, క్యాతన్‌పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ మున్సిపాలిటీలో చైర్మన్ల ఎన్నిక జరగనుంది.

కాంగ్రెస్ అధిక స్థానాలను...
తెలంగాణలో ఇటీవల మొత్తం మున్సిపాలిటీలు 116కు ఎన్నిక జరగా అందులో కాంగ్రెస్‌ 87, బీజేపీ 1, బీఆర్ఎస్‌ 17 మున్సిపాలిలటీలను గెలుచుకున్నాయి. 11 మున్సిపాలిటీలు వాయిదా పడగా నేడు తిరిగి ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. మొత్తం ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ 5, సీపీఐ-మిత్రపక్షం 1, బీజేపీ 1 గెలుచుకున్నాయి.


Tags:    

Similar News