SLBC Tunnel Accdent : సహాయక బృందాలకు సవాల్... మరో ఆప్షన్ లేదా?

శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కు బ్రేక్ వేయాలని నిర్ణయించడం మృతుల కుటుంబాలకు షాక్ కు గురి చేసింది

Update: 2025-04-27 04:01 GMT

శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కు బ్రేక్ వేయాలని నిర్ణయించడం మృతుల కుటుంబాలకు షాక్ కు గురి చేసింది. అయితే ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు ఎలా చేయాలన్న దానిపై నిపుణుల కమిటీ సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించినా సాంకేతిక కమిటీ మాత్రం మూడు నెలలు విరామం ప్రకటించాలని నిర్ణయించడం ఆందోళనకు దారితీస్తుంది. మృతదేహాలను వెలికి తీయడం లక్ష్యంగానే పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అసాధ్యం కాకపోవడంతో తాత్కాలిక విరామమే ప్రకటించామని అధికారులు చెబుతున్నారు.

షీర్ జోన్ ప్రాంతంలో...
శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో ప్రమాదం జరిగి 65వ రోజుకు చేరుకుంది. అయితే చివరి యాభై మీటర్ల ప్రాంతంలో బురద, మట్టి, బండరాళ్లను తొలగించడం కూడా కష్టంగా మారింది. దీనిని డీ2 ప్రాంతంగా సహాయక బృందాలు గుర్తించాయి. ఈ షీర్ జోన్ లో ఏ మాత్రం తవ్వకం జరిపితే వెంటనే ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న భయం అందరిలోనూ ఉంది. అందుకే సహాయక బృందాలకు ఈ ఆపరేషన్ సవాల్ గా మారింది. ఈ ప్రాంతంలోనే ఆరుగురి మృతదేహాలు ఉండే అవకాశముండటంతో అక్కడ ఏం చేయాలన్న దానిపై నిపుణుల సూచనలు తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించారు.
సాంకేతిక కమిటీ...
అయితే మరొక వైపు సొరంగంలో పనులపై కూడా అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సొరంగం పనులు ఆపకుండా కొనసాగించి, టన్నెల్ పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఉంది. ఇందుకోసం నిపుణుల కమిటీతో పాటు సాంకేతిక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలు సొరంగంలో పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఎలా ఎప్పుడు ఎటు నుంచి ప్రారంభించాలన్న దానిపై ఒక నిర్ణయానికి రానున్నారు. తిరిగి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అందుకే తాత్కాలిక విరామాన్ని ప్రకటించినట్లు అధికారులు తెిపారు.



Tags:    

Similar News