తెలంగాణలో కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 683 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు.
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 683 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. అతి తక్కువ కేసులు నమోదవ్వడం నెల రోజుల్లో ఇదే తొలిసారి. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,82,252 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,63,594 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
రికవరీ రేటు...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13,674 ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 4,107 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేగు 98.48 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.