నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం

నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది

Update: 2026-02-16 07:26 GMT

నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ ఎంఐఎం మద్దతుతో విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. నిజామాబాద్ మేయర్ గా ఉమారాణిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. డిప్యూటీ మేయర్ గా ఎంఐఎంకు చెందిన సల్మా తహీన్ ఎన్నికయ్యారు.

బీజేపీ అతిపెద్ద పార్టీగా...
అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ మేయర్ ను దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్, ఎంఐఎంలు కలవడంతో ఇక్కడ కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. బీజేపీకి 28 డివిజన్లు వచ్చినా పోటీకి దూరంగా ఉంది. దీంతో ఎన్నిక ఏకగ్రీవమయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడంతో ఎన్నిక సజావుగా ముగిసింది.


Tags:    

Similar News