రెండు రోజుల్లో టిక్కెట్లట... ఫస్ట్ లిస్ట్ రెడీ

తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కీలకమైన సీట్లకు అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది

Update: 2023-10-08 03:01 GMT

తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కీలకమైన సీట్లకు అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే అనేక కసరత్తులు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ త్వరగా ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆశావహులు ఢిల్లీ వెళ్లి తమ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఈసారి కొంత పాజిటివ్ వేవ్ ఉండటంతో టిక్కెట్ల కోసం పోటీ బాగా ఉంది. అధికార బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఖరారు చేసుకున్నారని తెలియడంతో తమకు తెలిసిన నేతలతో చిట్టచివరి సారి లాబీయింగ్ చేసేందుకు హస్తినలోనే నేతలు మకాం వేశారు.

తొలి విడతగా...
తెలంగాణలో మొత్తం 119 శాననసభ నియోకవర్గాలుండగా తొలి విడతగా యాభైకి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే వివిధ రకాలుగా రూపొందించిన సర్వేల ప్రకారం అభ్యర్థులను వడపోత పట్టి ఫైనల్ లిస్ట్‌ను మరో రెండు రోజుల్లో రిలీజ్ చేస్తారంటున్నారు. వివాదం లేని నియోజకవర్గాలు తొలి జాబితాలో ఉండే అవకాశముంది. ప్రధానంగా ఖమ్మం, మహబూబ్‌నగర్, వంటి కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో మాత్రం సీట్లు పెండింగ్ లోనే పెడతారని తెలిసింది.
ఈ జాబితాలో...
అలాగే ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచారంలో ముందుండాలంటే జాబితా విడుదలలో ఇక ఆలస్యం చేయకూడదని హైకమాండ్ భావిస్తుంది. కర్ణాటక తరహాలో ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని భావించినా అది సాధ్యం కాలేదు. చేరికలు ఎక్కువగా ఉండటం కారణంగా వేచి చూసే ధోరణిని అవలంబిస్తూ వచ్చింది. ఆర్థికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయకుంటే ఈసారి కూడా గెలుపు కష్టమేనని భావించిన హైకమాండ్ ఆ దిశగానే ఎక్కువగా ఎంపిక చేసిందని తెలుస్తోంది.
వారికే ప్రయారిటీ...
ఎన్నికల నిధుల కోసం పార్టీ వైపు చూడకుండా సొంతంగా ఖర్చు చేసుకునే వారి పేర్లే తొలి జాబితాలో ఉంటాయని తెలుస్తోంది. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఉన్న నియోజకవర్గాలు కూడా ఈ లిస్ట్‌లో ఉండనున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలయింది. టిక్కెట్ల కోసం భారీగా దరఖాస్తులు రావడం, ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటటంతో స్క్రీనింగ్ కమిటీకి వడపోత కష్టంగా మారింది. మరి ఫస్ట్ లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News