Telangana : హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఫలితాల్లో 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 1 వ వార్డు చెన్నమనేని అనూష విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించగా, 2 వ వార్డులో బూరుగు లత కిస్టస్వామి విజయం సాధించార. 3 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొండ రజిత సత్యనారాయణ పార్టీ గెలిచింది.
అధికవార్డుల్లో గెలిచి...
4 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం సాధించగా, 5 వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం సాధించారు. 6 వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంది. 7 వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్లయింది. హుస్నాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా ఫలితాలు కనిపిస్తున్నాయి.