Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. చలిపై ఏమన్నారంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా వానలు పడుతున్నాయి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా వానలు పడుతున్నాయి. ప్రధానంగా తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏపీలో అక్కడకక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పొడి వాతావరణం ఉండనుంది. అలాగే తెలంగాణలోనూ అదే వాతావరణం కొనసాగుతుంది. అయితే చలి తీవ్రత మాత్రం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈశాన్య, తూర్పు దిశగా వీచే గాలుల కారణంగా రానున్న రెండు రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో రెండు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో పొడి వాతావరణం కొనసాగుుతుందని తెలిపింది. ఏపీలో రెండు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా పొగమంచు కూడా అధికంగా ఉంటుంది. నేటి నుంచి సంక్రాంతి కావడంతో కొంత చలి తీవ్రత తగ్గే అవకాశముందని భావిస్తున్నా, మరికొన్ని రోజుల పాటు చలి ఉంటుందని తెలిపింది.
మూడు రోజుల పాటు తెలంగాణలో...
తెలంగాణలోనూ రానున్న మూడు రోజల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. పొడి వాతావరణం ఉన్నప్పటికీ ఎప్పటిలాగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత నెల రోజుల నుంచి తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇంకా కొన్ని రోజులు ఇదే రకమైన వాతావరణం కొనసాగుతుందని తెలిపింది.