KCR : కల్వకుంట్ల కుటుంబం కాదు.. కలవని కుటుంబం అట
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కలవని కుటుంబం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఆయన మాట్లాడుతూ బీసీలను, ఓసీలను కలవనీయరని అన్నారు. బీసీలను, ఎస్సీలను కలుపుకోనివ్వరని అన్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లును...
అందుకే దానికి కల్వకుంట్ల కుటుంబం కాదని, కలవని కుటుంబం అని రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను తాము గతంలోనే అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను పంపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదు నెలల నుంచి బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయన్న ఆయన పంచాయతీ రాజ్ చట్ట సవరణకు అందరూ ఆమోదించాలని కోరారు.